హైదరాబాద్లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
- నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే దారిలో అగ్నిప్రమాదం
- గోదాములో భారీగా ఎగిసిన మంటలు
- మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్లోని నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒక కాటన్ మిల్లు గిడ్డంగిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ మంటలు ఎగిసిపడటంతో గోదాములో నిల్వ ఉన్న సరుకు పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్కనే ఉన్న మ్యాట్రెస్ కంపెనీకి కూడా వ్యాపించాయి.
స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ అగ్నిప్రమాదం కారణంగా నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే రహదారిని మూసివేశారు.